top of page

ధూమపానాన్ని వదిలేస్తే మధుమేహ ముప్పు దూరం!

  • Writer: EDITOR
    EDITOR
  • Nov 15, 2023
  • 1 min read

ధూమపానాన్ని వదిలేస్తే మధుమేహ ముప్పు దూరం!

ree

ధూమపానానికి స్వస్థి పలకడం ద్వారా టైప్‌-2 మధుమేహం ముప్పును 30-40 శాతం మేర తగ్గించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య (ఐడీఎఫ్‌), ఆస్ట్రేలియాలోని న్యూక్యాజిల్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు..


రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ధూమపానం ప్రభావితం చేస్తుందని ఆధారాలు సూచిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో టైప్‌-2 మధుమేహం ఒకటి. ఊబకాయం, తగిన స్థాయిలో వ్యాయామం చేయకపోవడం, జన్యుకారణాలు ఇందుకు దోహదపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 53.7 కోట్ల మందికి మధుమేహం ఉన్నట్లు ఐడీఎఫ్‌ అంచనా. అకాల మరణాలకు కారణమవుతున్న రుగ్మతల్లో ఇది 9వ స్థానంలో ఉంది. మధుమేహంతో ముడిపడిన గుండె జబ్బు, మూత్రపిండాల వైఫల్యం, కంటి చూపు సన్నగిల్లడం వంటి సమస్యలు ధూమపానంతో పెరిగిపోవచ్చని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. దీనికితోడు గాయాలు ఆలస్యంగా మానడం, ఇన్‌ఫెక్షన్ల కారణంగా కాళ్లను తొలగించాల్సి రావడం వంటివి ఉత్పన్నం కావొచ్చని తెలిపింది. అందువల్ల ధూమపానాన్ని మానేయాలని ఐడీఎఫ్‌ కోరింది..

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page