అమావాస్య రోజు ఇంటికి గుమ్మడికాయ కడితే...
- PRASANNA ANDHRA

- Nov 20
- 1 min read
అమావాస్య రోజు ఇంటికి గుమ్మడికాయ కడితే...

అద్దె ఇంటిలో ఉండే వారు అమావాస్య రోజు ఇంటికి గుమ్మడికాయ కడితే చాలు అది కుళ్ళిన తర్వాత మార్చాలి, అదే సొంత ఇల్లు అయితే గుమ్మానికి కట్టిన గుమ్మడికాయతోనే దిష్టితీసి పగలగొట్టి కొత్త గుమ్మడి కాయ గుమ్మానికి కట్టాలి. ఇలా తరచుగా చేస్తే ఇంటికి యజమానికి క్షేమం..
వ్యాపారస్థలంలో అయితే సొంతం అయినా అద్దె అయినా ప్రతి అమావాస్య కి గుమ్మడికాయ కొట్టాలసిందే, వ్యాపార స్థలంలో మంగళవారం నాడు గుమ్మం ముందు నిమ్మకాయ రెండుగా కోసి కుంకుమ అద్ది ప్రవేశద్వారం వద్ద గడపకు అటూఇటూ ఉంచి మరుసటి రోజు తీసి పడేయాలి.
గుమ్మడికాయ లో అధికశాతం మెగ్నీషియం ఉంటుంది కనుక తరచుగా తింటే ఎముకలు గట్టి పడతాయి
ఇంటి యజమాని నిదిరించే గదిలో నైరుతి ములలో రాళ్లఉప్పు ఒక కప్ బౌల్ లో ఉంచాలి అలా మూడు రోజులు ఉంచాక దాన్ని తీసి దూరంగా ఎక్కడైనా మురికి గుంటలో కానీ పారె నీటిలో కానీ పడేసి రావాలి.. తరచుగా వచ్చే తగాదాలు తగ్గుతుంది. దిష్టి పోతుంది..ధనం నిలుస్తుంది.
కొందరు ఆడవాళ్లకు తల చిక్కు తీసిన వెంట్రుకలు ఇంట్లో దాచే అలవాటు ఉంటుంది అది అన్ని రకాల దరిద్రాలకు ఆహ్వానం చెప్తుంది.. ఇది వరకు కాలంలో ఇంటిబయట సపారులో గూటిలో వెంట్రుకలు దాచి సవరం కట్టుకునేవారు.









Comments