ఘనంగా సుందరయ్య 37 వ వర్ధంతి వేడుకలు.
- DORA SWAMY

- May 19, 2022
- 1 min read
ఘనంగా సుందరయ్య 37 వ వర్ధంతి వేడుకలు.
--ఆయన నిరాడంబర జీవితం అందరికీ ఆదర్శం.
పీడిత ప్రజల ఆశాజ్యోతి అమరజీవి అయిన పుచ్చలపల్లి సుందరయ్య 37 వ వర్ధంతి సందర్భంగా చిట్వేలు లో సిఐటియు నాయకులు, రైతులు, అంగన్వాడి కార్యకర్తలు,విద్యార్థి సంఘాలు, పంచాయతీ కార్మికులు, గ్రామ సేవకులు , టాక్సీ యూనియన్... మొదలగు సంఘాల నాయికుల, కార్మికుల మధ్య సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి,రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పంది కాళ్ళ మణి మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య చేసినటువంటి సేవ ఎనలేనదని సుందరయ్య కమ్యూనిస్టు నాయకుడుగా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడుగా స్వాతంత్ర సమర యోధుడుగా ఎనలేని సేవలు చేశారని తెలిపారు.
చిట్వేలు మండల ఎస్ఎఫ్ఐ యూనియన్ అధ్యక్షుడు పగడాల భరత్ కుమార్ మాట్లాడుతూ...పుచ్చలపల్లి సుందరయ్య (1913 –1985) ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడుగా కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన సుందరయ్య తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడని,కులవ్యవస్థను నిర్మూలించిన ఇతను అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి అని తనపేరులోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడని సహచరులు అతనిని "కామ్రేడ్ పి.ఎస్." అని పిలిచేవారు.[1] ఇతను నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపాడు.
స్వాతంత్ర్య సమరంలోని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. సుందరయ్య భార్య కూడా సీపీఐ-ఎం లోని ముఖ్య నాయకురాలని తెలంగాణ ప్రజల పోరాటం - దాని పాఠాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు, నివేదికలు అతని రాసినవెనని . పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘ కాలం పాటు ఉన్న తానూ ఆ సమయంలో పార్లమెంటుకు కూడా సైకిల్ మీద వెళ్ళేవాడని అతని నిరాడంబర జీవితం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి సిఐటియు మండల అధ్యక్షురాలు పగడాల సుధామణి, మండల కార్యదర్శి సుజాత, కుల వివక్ష వ్యతిరేక సంఘం డివిజన్ కన్వీనర్ ఓబిలి పెంచలయ్య, పంచాయతీ కార్మికుల అధ్యక్షుడు వెంకటేష్, గ్రామ సేవకుల సంఘం అధ్యక్షుడు కొరముట్ల సుధాకర్. టాక్సీ ఆటో యూనియన్ లు నాని, నాగిరెడ్డి , రైతు సంఘం నాయకులు గురవయ్య వికలాంగుల సంఘం అధ్యక్షులు జె ఎన్ ఆంధ్రయ్య, సీనియర్ నాయకులు ఆనందయ్య మొదలగు కార్మికులు పాల్గొన్నారు.








Comments