top of page

ఆర్.సి.యం ఎయిడెడ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలి - పి.ఎస్.వై.ఎఫ్

  • Writer: EDITOR
    EDITOR
  • Nov 21
  • 2 min read

ఆర్.సి.యం ఉమ్మడి కడప జిల్లాలోని ఎయిడెడ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని


కాల పరిమితి తీరిపోయిన నోటిఫికేషన్తో తిరిగి ఆర్సియం పాఠశాలలకు సంబంధించిన ఎయిడెడ్ పోస్టులను భర్తీ చేసే ప్రయత్నం మానుకోవాలని విద్యార్థి యువజన ప్రజాసంఘాలుగా జిల్లా అధికారులను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం

మాట్లాడుతున్న ప్రగతిశీల విద్యార్థి యువజన సమైక్య రాష్ట్ర కన్వీనర్ ఓబులేష్ కత్తి
మాట్లాడుతున్న ప్రగతిశీల విద్యార్థి యువజన సమైక్య రాష్ట్ర కన్వీనర్ ఓబులేష్ కత్తి

వైఎస్ఆర్ కడప జిల్లా


ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు 9 మండలాలలో ఆర్ సి ఎం ఎయిడెడ్ ప్రభుత్వ పాఠశాలల నందు 2024 సంవత్సరం ఒక నోటిఫికేషన్ ప్రత్యేకంగా ఆర్సియం బిషప్ హౌస్ కు సంబంధించి పాఠశాలల డిసిఎం గా కొనసాగే వ్యక్తి ద్వారా ఒక జీవోను తీసుకొని వచ్చి దాదాపు 24 పోస్టులను కేటాయించి ఉపాధ్యాయులను భర్తీ చేయడం జరిగిందనీ, భర్తీ చేసే విధానంలో కొంతమంది ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు లోకల్ కాకుండా నాన్ లోకల్ అయినా వారికి లోకల్ కడప జిల్లా పోస్టును ఎటువంటి రోస్టర్ పాటించకుండా కేటాయించడం జరిగిందని, అలాగే చాలామంది రిక్రూట్మెంట్ ముందు టెట్ పాస్ కాకపోయినా, ఉపాధ్యాయ అర్హత లేకున్నా వారికి ఆర్.సి.యం విద్యా సంస్థలలోని ప్రభుత్వ ఎయిడెడ్ పోస్టులను కేటాయించిన ఘటన కడప జిల్లాలో జరిగిందని ప్రగతిశీల విద్యార్థి యువజన సమైక్య(PSYF) రాష్ట్ర కన్వీనర్ ఓబులేష్ కత్తి ఆరోపించారు. అలాగే బీసీసీ క్రింద ఉపాధ్యాయ పోస్టులు ఉంటే బిసిఏ కి సంబంధించిన వారిని బీసీసీ కింద చేర్చిన సంఘటనలు కాలపరిమితి తీరిపోయిన నోటిఫికేషన్తో భర్తి చేసిన సంఘటనలు అక్రమాలకు పాల్పడిన ఘటనలు ఆర్.సి.యం పోస్టుల వ్యవహారంలో జరిగి ఉన్నాయని, అలాగే కలసపాడు మండల ఏరియాలో ఒక ఆర్డర్ ఉత్తరువు పొందిన ఉపాధ్యాయుడు తప్పుడు కుల దృవీకరణ సర్టిఫికెట్ ఇచ్చి ఉద్యోగం సంపాదించిన ఘటనపై కడప డిప్యూటీ డిఇఓ ఒక ఎంక్వయిరీ జరిపి ఆయనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటనలు లేకపోలేదని ఆరోపిస్తూ, విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాము జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రాంతీయ సంయుక్త పాఠశాలల విద్యాశాఖ అధికారికి జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా ఆర్థిక శాఖ డి.టి.ఓ లకు అనేక ఫిర్యాదులు చేశామన్నారు.


ఆ ఫిర్యాదుల పరిశీలనలో అనేక అవకతవకలు ఈ నోటిఫికేషన్ ద్వారా జరిగాయని జిల్లా పరిపాలన అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులు ఒక ఎంక్వయిరీ ద్వారా పలు సంఘాలు చేసిన ఫిర్యాదులు వాస్తవాలే అని తేల్చడం జరిగిందన్నారు. పోస్టుల వ్యవహారం పైన ఆర్జెడి శ్యాముల్ ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస విచారణ జరుగుతుండగా, మరోమారు అదే నోటిఫికేషన్ తో ఒక వ్యక్తి తప్పు వల్ల ఖాళీ అయిన పోస్టును మరొకరికి కేటాయిస్తామని ఒక ఫైలు రెడీ చేయడం జరుగుతోందన్నారు. తాము దీనిని వ్యతిరేకిస్తున్నామని, పూర్తిస్థాయిలో నిజనిర్ధారణ తేలే వరకు ఆర్.సి.యం పోస్టులను ఎటువంటి పద్ధతిలో రిక్రూట్మెంట్ జరపకూడదని డిమాండ్ చేశారు. ఈ విధానానికి వంత పాడుతున్న ఆర్జెడి, డీఈవో పై విచారణ జరపాలని ఈ వ్యవహారంపై రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ నోటిఫికేషన్ ను తక్షణమే రద్దు చేయాలని టెట్, రోస్టర్ విధానంపై రోస్టర్ విధానంపై కుల ధ్రువీకరణ తప్పుడుకుల ధ్రువీకరణ పత్రాలు పొందిన విధానంపై విజిలెన్స్ ద్వారా ఎంక్వయిరీ జరిపి మరొక కొత్త నోటిఫికేషన్ ద్వారా ప్రతి ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయాలని ఈ సందర్భంగా ప్రగతిశీల విద్యార్థి యువజన సమైక్య(PSYF) రాష్ట్ర కన్వీనర్ ఓబులేష్ కత్తి, ది పేరెంట్స్ అసోసియేషన్ రాయలసీమ ఇంచార్జ్ భాస్కర్, దళిత నాయకుడు బాబు సంయుక్తంగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయంపై విజయవాడ లో కమిషనర్ ని కలుస్తామని తెలియజేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page