చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ..!
- PRASANNA ANDHRA

- Apr 29, 2023
- 1 min read
చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ..!

హైదరాబాద్: తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్.. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చిస్తున్నట్టు సమాచారం. తెదేపా, జనసేన మధ్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతున్న తరుణంలో చంద్రబాబుతో పవన్ భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైకాపా ప్రభుత్వ విధానాలపై ఇరు పార్టీలు కలిసి ఐక్యంగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తున్నట్టు సమాచారం. పొత్తులపై ఇప్పటికిప్పుడు స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోయినప్పటికీ.. రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలనేదానిపై సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీవ్వమని ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇటీవలి కాలంలో ఇరువురు నేతలూ భేటీ కావడం ఇది మూడోసారి. విశాఖలో పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్న సందర్భంగా.. ఆయనకు జరిగిన పరాభవాన్ని దృష్టిలో ఉంచుకుని విజయవాడలోని నోవాటెల్ హోటల్‌కు వెళ్లి చంద్రబాబు పరామర్శించారు. ఆ తర్వాత చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై పవన్ స్పందించారు. చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించారు. తాజాగా మరో మారు ఇరువురు నేతలూ భేటీ అయ్యారు.












Comments