top of page

ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Aug 22, 2022
  • 1 min read

ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్

ree

నిన్న తిరపతి లో GRR కన్వెన్షనల్ హాల్ లో జరిగిన జనవాణి లో అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితుల సమస్యను వాళ్ళ గోషను పవన్ కళ్యాణ్ దృష్టికి నందలూరు గురివిగారి వాసు మందపల్లి జన సైనికుడు నరహరి వరద బాధితులు రాజ ,శ్రీను,శివసాయి తీసుకవెళ్ళారు పవన్ కళ్యాణ్ స్పందించి ఫోటోలు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకోని సీఎం జగన్ రెడ్డి స్వయంగా వచ్చి చెప్పిన వాగ్దానాలు ఒకటీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అందలేదు అన్ని సీఎం సొంత జిల్లా పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్రము లో ప్రజల పరిస్థితి ఏంటో ఆలోచించాలి అని ఇది ప్రభుత్వ వైఫల్యం అని నిలదీసారు. ఈ సమస్య గురించి నేను సిద్ధవటం సభలో కూడా అందుకే మాట్లాడాను కచ్చితంగా సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చి తగిన న్యాయం జరిగే విధంగా చూస్తాను అని, అలాగే దసరా తరువాత తిరుపతి నుంచి మొదలు పెట్టబోయే యాత్ర అప్పుడు ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు ఉంటాను అప్పటికి పూర్తి స్థాయిలో వారికి ఇవ్వవలసిన నష్ట పరిహారం అందకుంటే అప్పుడు స్వయంగా వచ్చి మందపల్లి లో పర్యటించి వారికి నష్టపరిహారం అందే విధంగా ప్రభుత్వం మీద వత్తిడి తీసుకవస్తాను అని హామి ఇచ్చారు అని గురివిగారి వాసు తెలియజేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page