top of page

రక్షణ గోడతో దశాబ్దాల సమస్యకు పరిష్కారం. ఎమ్మెల్యే కొరముట్ల.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jan 31, 2024
  • 1 min read

దశాబ్దాల సమస్యకు పరిష్కారం.

40 కోట్లతో రక్షణ గోడ కు కొరముట్ల భూమి పూజ.

ree

గుంజన ఏరు వరద ఉధృతితో ఎన్నో దశాబ్దాలగా సమస్యగా ఉన్న రైల్వే కోడూరు పట్టణంలోని పలు ప్రాంతాల ప్రజలకు పరిష్కారం దొరికిందని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం సుమారు 40 కోట్ల గుంజున ఏరు రక్షణ గోడ పనులకు భూమి పూజ చేశారు. వేగవంతంగా ఈ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.దీనితో నరసారాంపేట, గాండ్ల వీధి, ధర్మాపురం పరిసర ప్రాంతాల ప్రజల నివాసాలకు రక్షణ ఉంటుందని కొరముట్ల అన్నారు. అర్హులైన ప్రతి ఇంటికి పథకాల రూపంలో సంక్షేమంతో పాటు ప్రజల సమస్యలకు పెద్దపీట వేస్తున్న మా ప్రభుత్వాన్ని మారో మారు మీరంతా ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొల్లం గంగిరెడ్డి ,వైస్ ఎంపిపి ధ్వజ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, నియోజక వర్గ వైసిపి నాయకులు, క్లాస్ వన్ కాంట్రాక్టర్ పాటూరి శ్రీనివాసులరెడ్డి, చిట్వేలు మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు,సీనియర్ నాయకులు ఎల్వి మోహన్ రెడ్డి, లింగం లక్ష్మీకర్, ఎం.చిన్నా రాయల్ , ఏపీ టూరిజం డైరెక్టర్ మందల నాగేంద్ర, ఉప సర్పంచ్ తోట శివ సాయి, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి నాగేంద్ర,ఎంపీపీ చంద్ర, జడ్పిటిసి రత్నమ్మ, ఇరిగేషన్ సూపర్డెంట్ ఇంజనీర్ శ్రీనివాసులు , ఈఈ వెంకట్రామయ్య,జిల్లా కోఆప్షన్ సభ్యులు అన్వర్, డైరెక్టర్ ముజీబ్, పట్టణ కన్వీనర్ రమేష్,మాజీ ఎంపీపీ తమ్మిద తిరుపాలు, ఎంపీటీసీలు మహేశ్వర్ రెడ్డి, పుష్పలత, సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page