ఆడుదాం ఆంధ్రాలో ప్రతిభ కనబరిచిన ప్రొద్దుటూరు క్రీడాకారులు
- PRASANNA ANDHRA

- Feb 14, 2024
- 1 min read
ఆడుదాం ఆంధ్రాలో ప్రతిభ కనబరిచిన ప్రొద్దుటూరు క్రీడాకారులు


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఆడుదాం ఆంధ్ర క్రికెట్ క్రీడలో ప్రతిభ కనపరిచి విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో ప్రొద్దుటూరు నియోజకవర్గ లైట్ పాలెం సెంటర్ సెక్రటేరియట్ టీం అడ్మిన్ రమాదేవి నేతృత్వంలో కెప్టెన్ ఎస్ సాధక్ హుస్సేన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఆడుదాం ఆంధ్ర క్రికెట్ పోటీల నందు మూడో స్థానంలో నిలిచారు. మొదటగా అనకాపల్లి తో తలబడిన ప్రొద్దుటూరు టీం 35 పరుగుల తేడాతో విజయం సాధించి రెండవ ఆటలో పల్నాడు జట్టుతో తలపడి 28 పరుగుల తేడాతో గెలుపొంది, ఏలూరు జట్టుతో తలపడి మూడు వికెట్ల తేడాతో రన్నర్స్ గా నిలిచి, తదుపరి ఈస్ట్ గోదావరి జట్టుతో సెమీఫైనల్స్ నందు తలపడి 18 పరుగుల తేడాతో గెలుపొంది, రెండు లక్షల రూపాయల నగదు బహుమతి షీల్డ్ సాధించారు. ఆటలో ప్రతిభ కనబరచి అత్యధిక స్కోర్ సాధించిన ఎస్ నసీరుద్దీన్ ను కెప్టెన్ సాధకు హుస్సేన్ అభినందించారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాభిమానులు జట్టులోని క్రీడాకారులను అభినందించి రానున్న రోజులలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకొని ప్రతిభ కనపరచి నియోజకవర్గానికి ఖ్యాతిని తీసుకురావాలని కోరారు.










Comments