పేట్రేగిపోతున్న ఇసుక మాఫియా
- PRASANNA ANDHRA

- Oct 30, 2024
- 1 min read
పేట్రేగిపోతున్న ఇసుక మాఫియా


వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
తన పొలం నుంచి ఇసుక రవాణా చెయ్యద్దు అని చెప్పినందుకు గురివిరెడ్డి అనే టీడీపీ నాయుడిపై రాళ్ళ దాడి చేసిన ఘటన ప్రొద్దుటూరు మండలం రామాపురం గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ప్రదీప్ అనే యువకుడు తన పొలం నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడని పలుమార్లు హెచ్చరించిన వినకుండా బుధవారం ఉదయం అక్రమంగా ఇసుక రవాణా చేస్తుంటే తాను అడ్డుకున్నానని, ప్రదీప్ మరో నలుగురు తనపై రాళ్లతో దాడికి పాల్పడినట్లు బాధితుడు తెలిపాడు. రక్త గాయాలైన గురివిరెడ్డి ని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురివిరెడ్డి ని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పరామర్శించారు.









Comments