top of page

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Oct 3, 2022
  • 1 min read

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


సోమవారం ఉదయం స్థానిక ప్రొద్దుటూరు మున్సిపాలిటీ లోని మునిసిపల్ కమిషనర్ ఛాంబర్ నందు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అర్హులయిన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇందులో తొండలదిన్నె కు చెందిన సి. సరస్వతి కి మూడు లక్షల ఇరవై వేలు, నంగనూరుపల్లె కు చెందిన రవి కి అయిదు లక్షలు, కొత్తపల్లె కు చెందిన ఎస్. మల్లేశ్వరికి యాబై వేల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం నరాల వ్యాధితో బాధపడుతున్న చౌడం చంద్రాకు ఒక సంవత్సరానికి సరిపడా మందులను వితరణ, మైదుకూరు నియోజకవర్గానికి చెందిన పేద కళాకారుడి కుమారుడు మల్లికార్జున ఉన్నత విద్యకు రెండు లక్షల రూపాయల ఆర్ధిక సాయం, గడప గడప కార్యక్రమంలో వృద్ధురాలు శేషమ్మ తనకు ప్రభుత్వం అందిస్తున్న పిన్షన్ పలు కారణాల చేత అందటం లేదని ఎమ్మెల్యే రాచమల్లుకు విన్నవించగా స్పందించిన ఆయన నేడు ప్రతి నెలా పదిహేను వందల రూపాయలు తనకు అందేలా ఒకేసారి తొమ్మిది వేల రూపాయలు ఆమెకు అందచేశారు.

ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ మానవతా దృక్పధంతో తాను చేసిన ఈ సహాయం చిన్నదయినా, కష్టంలో ఉన్న పేదలకు ఆసరాగా నిలుస్తుందని, కష్టాన్ని ద్రిగమింగి పేదలు తమ బ్రతుకులీడుస్తున్నారని, అలాంటి వారి కష్టాలలో తాను ఆదుకోవటం సంతోసాన్నిస్తుందని, దానధర్మాల ద్వారా తాను ఇతరులను ప్రభావితం చేయటంలో కలిగే ఆనందం ఏమిటో తనకు తెలుసునని, ఇది గిట్టని ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేసి వారి స్థాయిని వారే కించపరచుకుంటున్నారని, తనకు శక్తీ ఉన్నంత వరకు సేవా సహాయ కార్యక్రమాలు చేస్తానని, రాజకీయాలకు దాన ధర్మాలకు సంబంధం లేదని, ప్రజల హృద్దయాలలో సుస్థిర స్థానం సంపాదించే దిశగా తాను అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ కౌన్సిలర్లు వరికూటి ఓబుల్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, అనిల్, కమాల్ బాషా, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page