ప్రెస్ క్లబ్ నందు ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- PRASANNA ANDHRA

- Jan 26, 2023
- 1 min read
ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ నందు ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

వైఎస్సార్, జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ నందు 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని అధ్యక్షుడు బసిరెడ్డి రమణా రెడ్డి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఐలు, అధికారులకు సాదర స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందించిన పాత్రికేయులు. కార్యక్రమంలో పాల్గొన్న ఒకటవ పట్టాణ సీఐ రాజా రెడ్డి, రెండవ పట్టణ సీఐ ఇబ్రహీం, ట్రాఫిక్ సీఐ యుగంధర్, ఎస్ఐలు రెడ్డి సురేష్, మహేందర్, భాస్కర్. ఈ సందర్భంగా అధ్యక్షుడు రమణా రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయ సోదరులు సోదరభావంతో ఒకటిగా మెలగాలని, ప్రెస్ క్లబ్ నందు తరతమ బేధాలు మరచి చిన్నాపెద్దా ప్రతిఒక్కరితో గౌరవంగా మెలగాలని హితువు పలికారు.








Comments