top of page

అవినాష్ రెడ్డి నేరం చేశారని రుజువు అయితే 'నా మాట మీద నిలబడి రాజీనామా చేస్తాను' - MLA రచమల్లు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Mar 3, 2022
  • 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరు, ఈ మధ్య కాలంలో విషపూరితమైన కొన్ని పత్రికలు అవినాష్ రెడ్డి పై విషప్రచారం చేస్తున్నాయి.Ysr కుటుంబ పరువుని బజారుకు లాగేందుకు నిత్యం కొన్ని పత్రికలు పని చేస్తున్నాయి. ఎంపీ అవినాష్ రెడ్డి ని హత్య కేసులో ఇరికించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు, ఆ పార్టీ సానుభూతి పత్రికలు కుట్ర పన్నుతున్నాయి. అవినాష్ రెడ్డి నేరం జరిగిన ప్రాతంలో సాక్షాలను ధ్వజం చేశారనే ఆరోపణలు నిజదూరం. ఒకవేళ అవినాష్ రెడ్డి ని ముద్దాయిగా చేర్చిన కూడా న్యాయస్థానాలు ఉన్నాయి.

నన్ను రాజీనామా చేయాలని బత్యాల చెంగలరాయుడు మరికొంత మంది అడుగుతున్నారు. ఎందుకు చేయాలి? గతంలో నేను మాట్లాడిన మాటలు బాగా వినండి.

న్యాయస్థానంలో అవినాష్ రెడ్డి నేరం చేశారనే రుజువు అయితే నా మాట మీద నిలబడి రాజీనామా చేస్తాను. రాజకీయ సన్యాసం చేస్తాను.

అవినాష్ రెడ్డి ఎంతో సాత్వికుడు, సౌమ్యుడు. అతడు నేరం చేసే వ్యక్తిత్వం కాదు. తెలుగుదేశం పార్టీ నేతలతో చెప్పించుకునే వ్యక్తిత్వం నాది కాదు. చెయ్యని నేరాన్ని రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఆపాదించి ఆ రాజకీయా లబ్దిని ఉపయోగించుకోవాలని టీడీపీ చూస్తుంది. YSR తండ్రిని చంపిన వాళ్ళను సైతం YS కుటుంబం క్షమించి వదిలేసింది.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page