top of page

సర్వే నంబర్ల సవరణ అక్రమార్జన...!!!

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Aug 13, 2022
  • 1 min read

సర్వే నంబర్ల సవరణ అక్రమార్జన...!!!


వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

ree

గతంలో ఎన్నడూ లేని సంస్కృతి నేడు ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో వింత పోకడలతో వికృత రూపం దాల్చింది, రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని అంటగా, అక్రమ మార్గ అన్వేషణ ద్వారా అక్రమార్కులు లేని భూములు ఉన్నట్లు, ఉన్న భూములను పలువురికి విక్రయిస్తూ అక్రమార్జన చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఇలాంటి సంఘటనలపై హెచ్చరికలు జారీ చేసి, నియోజకవర్గ పరిధిలోని బాధితులు తన వద్దకు వస్తే తాను తగు న్యాయం చేస్తానని హామీ ఇవ్వగా, గత పది రోజుల నుండి ఒక్కో సంఘటన వెలుగులోకి వస్తున్నాయి, వివరాల్లోకి వెళితే...

స్థానిక ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని, కొత్తపల్లె పంచాయతీ మీనాపురం గ్రామం నందు గల కొత్తపల్లె గ్రామ పొలం సర్వే నెంబర్ 125/2, 125/3 నందు 38 సెంట్ల భూమి, సర్వే నెంబర్ 125/4 నందు 52 సెంట్ల భూమి సాగులో ఉండగా, సవరణ పేరిట 125/2 సర్వే నెంబర్ యందు ఉండబడిన 38 సెంట్ల స్థలాన్ని 125/6 సర్వే నెంబర్ గా చూపి మార్కాపురం వెంకటయ్య అను వ్యక్తి 19.05.2011న విక్రయించగా, తదనంతరం 125/2 సర్వే నెంబర్ పాత డాక్యుమెంట్ ద్వారా మరో మారు అనగా 24.03.2022 నాడు విక్రయించారని, 125/6 సర్వే నెంబర్ గల భూమి తమదని గంజికుంట సంజీవ రాయుడు తెలిపారు. సంబంధిత ప్రభుత్వ అధికారుల పాత్ర ఏంటో నిజానిజాలు నిగ్గు తేల్చి తనకు తగు న్యాయం చెయ్యాలని, అధికారులకు పలుమార్లు తాము సమస్య విన్నవించుకున్నా తమకి తగు న్యాయం జరగలేదని ఈ సందర్భంగా వారు తెలిపారు. .


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page