మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
- PRASANNA ANDHRA

- Sep 20, 2023
- 1 min read
మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

కడప జిల్లా, ప్రొద్దుటూరు
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపడంతో వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి మహిళా కార్యకర్తలు మోడీకి పాలాభిషేకం చేశారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడంతో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రధాని మోదీ వల్లనే సాధ్యమవుతుందని బిజెపి పట్టణ మహిళ అధ్యక్షురాలు లావణ్య అన్నారు. మహిళలంతా కలిసి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రొద్దుటూరు కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు మోడీకి పాలాభిషేకం చేశారు. మహిళా బిల్లును ఆమోదం తెలపడంతో మహిళ బిజెపి కార్యకర్తలు మోడీకి ధన్యవాదాలు తెలిపారు. బిల్లు ఆమోదం వల్ల లోక్ సభ రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయి.









Comments