ప్రొద్దుటూరు బీజేపీ కన్వీనర్ గా జి.శ్రీనివాసులు
- PRASANNA ANDHRA

- Mar 28, 2023
- 1 min read
ప్రొద్దుటూరు బీజేపీ కన్వీనర్ గా జి.శ్రీనివాసులు

వైఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
బీజేపీ జాతీయ కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల కన్వీనర్, కో కన్వీనర్లను ప్రకటించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ కన్వీనర్ గా గొర్రె శ్రీనివాసులు నియమించటం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందుగా ప్రొద్దుటూరు నియోజకవర్గ బీజేపీ తరుపున పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియచేసారు. రానున్న ఎన్నికలకు సమాయత్తం చేయటానికి నియోజకవర్గ కన్వీనర్లను నేడు నియమించిందని, నాయకులు, కార్యకర్తలు ప్రజల ముందుకు పార్టీని తీసుకుని వెళ్లి క్షేత్రస్థాయిలో బలోపేతం చేయటానికి కన్వీనర్ వ్యవస్థ ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీలో సమూలమైన మార్పులు సంభవించనున్నట్లు తెలిపారు. పార్టీ ఆశించిన మేరకు మెరుగైన ఫలితాలు తాము సాధించనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.









Comments