top of page

ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం బాలుడు మృతి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Feb 22, 2022
  • 1 min read

కడప జిల్లా జమ్మలమడుగు లో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్వాకం ఓ బాలుని బలితీసుకుంది.


వివరాల్లోకి వెళితే.... సంజామల మండలం కానాల గ్రామానికి చెందిన రాముడు అనే 12 ఏళ్ల చిన్నారి కి కాలికి గాయం కావడంతో చికిత్స నిమిత్తం జమ్మలమడుగు లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకువచ్చారు. గత రెండు రోజులుగా ఆ చిన్నారికి వైద్యం అందిస్తూ చికిత్స కూడా నిర్వహించారు. అయితే ఈ రోజు సాయంకాలం ఆసుపత్రి సిబ్బంది నిర్వాకంతో బాలునికి ఆక్సిజన్ తీసేశారని ఈ క్రమంలోనే బాలుడు మృతి చెందాడని, తమకు తెలియకుండా మృతదేహాన్ని ఆస్పత్రి అంబులెన్స్లో తరలించే ప్రయత్నం చేస్తుండటంతో తాము అడ్డుకున్నామని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆసుపత్రి ప్రభుత్వ వైద్యశాలలో మెడికల్ సూపర్డెంట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రామేశ్వరుడు ది కావడం గమనార్హం. ఆస్పత్రి సిబ్బంది మాత్రం ఆ బాలునికి గత 12 రోజులుగా ఆరోగ్యం సరిగా లేదని ఈ క్రమంలోనే బాలుడు మృతిచెందాడని సదరు ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్. కిరణ్ తెలిపారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page