పెట్రోల్ ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణం - ప్రధాని
- PRASANNA ANDHRA

- Apr 27, 2022
- 1 min read
పెట్రోల్ ధరలపై ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమన్నారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినా.. రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్లే ధరలు పెరుగుతున్నాయన్నారు. బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీలో పెట్రోల్ పై వ్యాట్ తగ్గించాలని మోడీ తెలిపారు. అప్పుడే ప్రజలపై పెట్రో భారం తగ్గుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే ధరలు తగ్గుతాయన్నారు.








Comments