top of page

ప్రసన్న ఆంధ్ర కథనానికి స్పందించిన ఎమ్మెల్యే

  • Writer: EDITOR
    EDITOR
  • May 16, 2022
  • 1 min read

గాజువాక ప్రసన్న ఆంధ్ర వార్త రిపోర్టర్ వీరా


ప్రసన్న ఆంధ్ర కథనాలకు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి స్పందించి వాలంటరీ లకు పురస్కారం అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది.

ree

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉగాది పురస్కారం అవార్డు వాలంటరీ లకు గత2021 సంవత్సరం వంద మందికి పైగా పురస్కారం అవార్డు మాకు అందలేదని వాలంటరీలు బాధాకరం వ్యక్తం చేశారు. ఈసారి కూడా మాకు పడదని నిరాశలో ఉన్న సమయంలో వాలంటరీ ల గురించి ప్రసన్న ఆంధ్ర కథనాలకు స్పందించిన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి.

ree

ఈ సంవత్సరం కూడా వంద మందికి పైగా వాలంటరీ లకు అందలేదని ప్రసన్న ఆంధ్ర కథనాలు రావడంతో వెంటనే స్పందించిన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జోనల్ కమిషనర్-6 శ్రీధర్ కి ఎవరైతే వాలంటరీ లో అర్హులైన ఉన్నారో వారికి తక్షణమే ఉగాది పురస్కారాలు అమౌంట్ రిలీజ్ చేయమని ఆదేశించడం జరిగింది. ఈ విషయం మీద జోనల్ కమిషనర్ శ్రీధర్ స్పందించి ఈ వారంలో ప్రతి ఒక్కరికి కూడా సేవా మిత్ర, సేవ రత్న, సేవ వజ్ర, అమౌంట్ రిలీజ్ చేస్తామని తెలియజేశారు. కొన్ని అనివార్య కారణాలవల్ల అమౌంట్ పడకపోవడం గురించి పత్రికా కథనాలను చూసిన ఎమ్మెల్యే కి జోనల్ కమిషనర్ కి వాలంటరీ యొక్క బాధలను వివరిస్తూ ప్రసన్న ఆంధ్ర పేపర్ లో ప్రచురించిన పత్రికకు వాలంటరీ అందరూ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ హర్షం వ్యక్తం చేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page