ఎమ్మెల్యే వరద చొరవతో 50 ఏళ్ల సమస్య పరిష్కారం
- EDITOR

- Nov 27
- 1 min read
ఎమ్మెల్యే వరద చొరవతో 50 ఏళ్ల సమస్య పరిష్కారం

కడప జిల్లా, ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని స్థానిక కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న ప్రకాష్ నగర్ వాసులు గత 50 సంవత్సరాల నుండి స్మశాన వాటికకు కనీసం రోడ్డు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్న విషయం విధితమే. గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు నాయకుల, అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఈసమస్య పరిష్కారం కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి, యువనాయకుడు నంద్యాల కొండారెడ్డి అలాగే కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి దృష్టికి స్థానిక ప్రకాష్ నగర్ వాసులు తమ సమస్యను తీసుకెళ్లగా, వారు వెంటనే స్పందించి ప్రకాష్ నగర్ స్మశాన వాటికకు రోడ్డును ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపిన నేపథ్యంలో, స్థానిక ప్రకాష్ నగర్ టిడిపి నాయకులు సింహం దేవదాసు, తుపాకుల మధు, స్థానిక యువత, ప్రకాష్ నగర్ ప్రజలు కలిసి స్మశాన వాటిక రోడ్డుకు నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, యువనాయకుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి లకు కృతజ్ఞతలు తెలియజేశారు.








Comments