డాక్టర్ నిర్లక్ష్యం గర్భిణి మృతి
- PRASANNA ANDHRA

- May 5, 2022
- 1 min read
వై.ఎస్.ఆర్ జిల్లా, బద్వేల్ పద్మావతి హాస్పిటల్ గర్భిణి మృతి, హస్పటల్ వద్ద కుఅందోళన కు దిగిన బంధువులు. గోపవరం మండలం బుచ్చనపల్లి గ్రామానికి చెందిన విష్ణు ప్రియ అనే 21 సంవత్సరాల మహిళ నాలుగు రోజుల క్రితం బిపి ఎక్కువ కావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం వరకు మీ పాపకు ఎటువంటి అపాయం లేదు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని చెప్పిన డాక్టర్, డాక్టర్ పద్మావతమ్మ మరల గంట తిరగకముందే విష్ణు ప్రియ పరిస్థితి విషమంగా ఉందని బంధువులకు సమాచారం ఇవ్వకుండా అంబులెన్స్ ద్వారా కడప కు తరలింపు, కొద్ది దూరం వెళ్లగానే విష్ణు ప్రియ మృతిచెందడంతో హాస్పిటల్ వద్ద విష్ణు ప్రియ మృతదేహంతో ఆందోళనకు దిగిన బంధువులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.








Comments