తపాలా శాఖ ప్రొద్దుటూరు డివిజన్ నందు ఇంటర్వ్యూలు
- PRASANNA ANDHRA

- Feb 3, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు తపాలా శాఖలో భాగమైన తపాలా జీవిత భీమా, జీవిత భీమా రంగంలో 138 వసంతాలు పూర్తి చేసుకొని 01.02.2022న 139వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంలో తమ ఖాతాదారులకు, సేల్స్ ఫోర్స్ కి కృతజ్ఞతలు తెలియచేసారు ప్రొద్దుటూరు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్, ఈ సందర్భంగా ప్రొద్దుటూరు డివిజన్ తపాలా సూపరింటెండెంట్ ఎం. ఆదినారాయణ తపాలా జీవిత భీమా ఏజెంట్లుగా ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల నుండి దరఖాస్తులు కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు 10.02.2022 నుండి 11.02.2022 తేదీలలో ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఇంటర్వ్యూలకు హాజరు కాగలరని కోరారు, ఇందుకు గాను విద్యార్హత 10వ తరగతి కాగా, వయసు పరిమితి 18 నుండి 60 లోపు వారు అర్హులని తెలిపారు. ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం : తపాలా సురింటెండెంట్ వారి కార్యాలయం, ప్రధాన తపాలా కార్యాలయం, ప్రొద్దుటూరు - 516360, మరింత సమాచారం కొరకు ఎస్. తిరుమలకొండు, డెవలప్మెంట్ ఆఫీసర్, తపాలా జీవిత భీమా వారిని 08564252816 లేదా 9966276933 నందు సంప్రదించగలరని తెలిపారు.









Comments