పోరెడ్డి సుజాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ
- PRASANNA ANDHRA

- Jan 12, 2024
- 1 min read
పోరెడ్డి సుజాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
సంక్రాంతి సంబరాలలో భాగంగా, శుక్రవారం సాయంత్రం ప్రొద్దుటూరు మున్సిపల్ ఒకటో వార్డు బొల్లవరం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో వైయస్సార్సీపి రాష్ట్ర అదనపు కార్యదర్శి, ఒకటవ వార్డు ఇంచార్జి పోరెడ్డి నరసింహారెడ్డి స్థాపించిన పోరెడ్డి సుజాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఒకటో వార్డు మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని చీరలు అందుకున్నారు.










Comments