రేపు జరగబోవు ర్యాలీని జయప్రదం చేయండి.
- DORA SWAMY

- Aug 14, 2022
- 1 min read
75 స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా... చిట్వేలిలో
సాయిహరి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.
అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకుల పిలుపు.
75 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా రేపు ఉదయం కొరముట్ల సాయి హరి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటల నుంచి హై స్కూల్ ప్రాంగణం మొదలుకొని వైయస్సార్ విగ్రహం వరకు 100 అడుగుల జాతీయ జెండాతో స్వాతంత్ర సమర అమరులకు జేజేలు పలుకుతూ.. వారందరి సేవలను కొనియాడుతూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నామని; కావున మండల పరిధిలో పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, అధికారులు,ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు,ఉద్యోగులు, ప్రజలు, యువత, విద్యార్థిని,విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని మనదేశ కీర్తిని చాటుతూ.. ప్రాణం త్యాగం చేసి స్వాతంత్రం సంపాదించి మనందరికీ స్వేచ్ఛ వాయువులు నింపిన అమర జీవులకు నివాళులు అర్పించాలని కొరముట్ల సాయి హరి చారిటబుల్ చిట్వేలి మండల ప్రతినిధులు పగడాల గణేష్, కంచర్ల సుధీర్ రెడ్డి అందరికీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ ఆహ్వానితులేనని వారన్నారు.








Comments