ఘనంగా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి
- PRASANNA ANDHRA

- Aug 2, 2022
- 1 min read
జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించారు.

ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అలాగే పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం ప్రారంభించారుపింగళి వెంకయ్య స్వస్థలం కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు గ్రామంలో జరిగే కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, నగరిలో మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే, పింగళి వెంకయ్యపై రూపొందించిన ప్రత్యేక కవర్‌ను పోస్టల్ శాఖ ఆవిష్కరించనుంది.








Comments