రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి
- PRASANNA ANDHRA

- Apr 29, 2023
- 1 min read

రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి


వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
శుక్రవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా మదీనా హోటల్ నిర్వహిస్తున్న ఖాదర్, కరీముల్ల ఇరువురు కలిసి ప్రొద్దుటూరు నుండి జమ్మలమడుగు వెళుతుండగా మార్గమధ్యమున దేవగుడి సమీపంలో వెనుకవైపు నుండి పల్సర్ ద్విచక్ర వాహనం అతివేగంగా వచ్చి వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొనగా, క్రిందపడి తీవ్ర గాయాల పాలైన ఖాదర్, స్వల్ప గాయాలపాలైన కరీముల్ల. స్థానికుల సమాచారంతో హుటాహుటిన సంఘటనా స్థలం నుండి 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఖాదర్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న జమ్మలమడుగు పోలీసులు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.




ప్రసన్న ఆంధ్ర ఆన్లైన్ లో ప్రకటనల కోసం సంప్రదించండి 9908051001








Comments