పెందుర్తి ని విశాఖపట్నం జిల్లాలో ఉంచాలి - టీడీపీ
- PRASANNA ANDHRA

- Feb 6, 2022
- 1 min read
ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, 79వ వార్డు లంకలపాలెం, పెందుర్తి నియోజకవర్గంను విశాఖపట్నం జిల్లాలో ఉంచాలని 79 వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణ మూర్తి గారు హాజరై కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సౌలభ్యంగా ఉండాలి అంటే పెందుర్తి నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో ఉంచాలని తొమ్మిది వార్డులు కలిగిన విశాఖపట్నంను ఆనుకొని పెందుర్తి నియోజకవర్గం ఉన్నది. పరిపాలన సౌలభ్యం కోసం మరియు అనేక కంపెనీలు గ్రేటర్ విశాఖను ఆనుకొని ఉన్నవి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొని సంతకాల సేకరణ లో చేయడం జరిగింది.









Comments