top of page

పెనగలూరు మండలం వీఆర్ఏ నూతన కమిటీ ఎన్నిక

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Dec 1, 2022
  • 1 min read

పెనగలూరు మండలం వీఆర్ఏ నూతన కమిటీ ఎన్నిక

ree

రాజంపేట, పెనగలూరు మండలం లో వీఆర్ఏ సంఘం సమావేశం బుధవారం తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో మధు అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వి ఆర్ ఏ ల నూతన మండల  కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా, పి మధుబాబు, ప్రధాన కార్యదర్శిగా ఎం.కోటేశ్వరరావు, కోశాధికారిగా డి.మల్లేశ్వరయ్య, ఉపాధ్యక్షులుగా వై.జయరాం, ఓ.దుర్గాప్రసాద్ ఐ.నరసింహులు, పి.గిరిజ ఎస్.జ్యోతి, ఎస్.ప్రేమలత, సహాయ కార్యదర్శులుగా కే.నరసయ్య, ఎం.శ్రీను, డి.హరి ప్రసాద్, ఎస్.నరసింహులు, ఎం.లావణ్య,  వై.లక్ష్మీదేవి తో పాటు మరో 23 మందిని కమిటీ  సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.

వారిని ఉద్దేశించి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల ముందర, తమ ప్రభుత్వం వస్తూనే రూ 18 వేలు కనీసం ఇస్తామని మాట చెప్పి మూడున్నర సంవత్సరం అయినా ఒక్క రూపాయి పెంచలేదన్నారు. పోరాడి సాధించుకున్న, డి.ఏ ని రికవరీ  చేస్తూ రివర్స్ పాలన చేస్తున్నారని విమర్శించారు. ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ 26000 ఇవ్వాలని, తెలంగాణ లాగా పే స్కేల్ అమలు చేయాలన్నారు. డి.ఎ సిఐటియు పోరాట ఫలితంగా300 సాధిస్తే, జగన్మోహన్ రెడ్డి రికవరీ చేస్తున్నారని అన్నారు. వేతనంతో కూడిన డి.ఏ ఇవ్వాలని, అటెండర్ నైట్ వాచ్మెన్లు, డ్యూటీలు రద్దు చేయాలన్నారు. శ్రమ దోపిడి అరికట్టాలన్నారు. అటెండర్, వాచ్ మెన్, డ్రైవర్ పోస్టులు సీనియార్టీ అర్హతను బట్టి ఇవ్వాలన్నారు. వీఆర్వోలుగా ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలన్నారు. భూ సర్వే సందర్భంగా, టీఏ, డీఏలు, రవాణా ఖర్చులు చెల్లించాలన్నారు.  ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పంది  కాళ్ళ మణి, మాట్లాడుతూ వీఆర్ఏలు హక్కుల కోసం పోరాడాలని, వీఆర్ఏలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రైల్వే కోడూరు మండల కన్వీనర్, గిరిజన నాయకుడు బొజ్జ శివయ్య, సిఐటియు మండల నాయకులు కిరణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page