పత్తి లక్షుమ్మ మృతికి రెడ్యo సంతాపం
- PRASANNA ANDHRA

- Jan 7, 2022
- 1 min read
ఖాజీపేట మండలం తిప్పయపల్లె కు చెందిన, ప్రస్తుతం మైదుకూరు పట్టణం కడప రోడ్డు లో ఉన్న పత్తి జోగిరెడ్డి భార్య పత్తి లక్షుమ్మ (59) అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. మైదుకూరు పట్టణంలోని పత్తి లక్షుమ్మ స్వగృహంలో ఆమె మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి రెడ్యo ప్రగాఢ సానుభూతి, తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరిచారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈమె మరణం తమను బాధించిందని రెడ్యo వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు ముత్తూరు రఘురామిరెడ్డి, జంపన గంగి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.









Comments