ప్రతి విద్యార్థి ఉన్నతంగా ఎదగాలి. ప్రిన్సిపల్ ఎం శ్రీలత.
- DORA SWAMY

- Aug 11, 2022
- 1 min read
విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి.. ఉన్నతంగా ఎదగాలి.
రైల్వే కోడూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పేరెంట్స్ కమిటీ మీటింగ్ లో ప్రిన్సిపల్ ఎం శ్రీలత.

రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం శ్రీలత అధ్యక్షతన.. పేరెంట్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తల్లిదండ్రులు మీ పిల్లలను ఈ కళాశాలలో చేర్పించడం చాలా సంతోషమని; తల్లిదండ్రులుగా మీ పిల్లలుగా ఎంత బాధ్యత వున్నదో అంతకంటే ఎక్కువ గా ప్రతి విద్యార్థి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని నిరంతరం విద్యార్థి శ్రేయస్సు కొరకు మేము కృషి చేయడం జరుగుతుందనీ ప్రిన్సిపాల్ గా నేను మరియు మా అధ్యాపక అధ్యపకేతర సిబ్బంది ఎంతో కష్టపడి పనిచేస్తున్నామని అన్నారు.మీరు కూడా మీ పిల్లల అభివృద్ధి కొరకు తగిన సలహాలు సూచనలు ఇచ్చి వారి అభివృద్ధి కొరకు మనమందరం కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ. కె.శ్రీధర్,ఐ.క్యూ.ఏ.సి సమన్వయ కర్త డాక్టర్ ఏ.శ్రీలక్ష్మి,అకడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ యస్ హరి ప్రసాద్,పేరెంట్ కమిటీ కన్వీనర్ శ్రీ డి.వెంకటేశ్వర్లు, అధ్యాపకులు దాసరి మోషే,పెంచలయ్య డాక్టర్ ప్రేమలత,డాక్టర్ శ్రీనివాసులు,శివయ్య,సురేంద్ర,వెంకటరమణ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్దులు పాల్గొన్నారు








Comments