కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు
- PRASANNA ANDHRA

- Jul 31, 2022
- 1 min read
పల్నాడు జిల్లా, కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన, మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వెండి గోపి (20) ని చంపిన తల్లిదండ్రులు. జులాయిగా తిరుగుతూ కనిపించిన వాళ్ల దగ్గర అప్పులు చేస్తూ కుటుంబపరువు తీస్తున్నాడనే కోపంతో గత మూడు రోజుల క్రితం కోపంతో రాడ్ తో కొట్టడంతో అక్కడక్కడే చనిపోయిన గోపి. కొడుకు శవాన్ని మూటగట్టి ఆటో డ్రైవర్ సహాయంతో తీసుకెళ్లి పొలంలో పాతి పెట్టిన వైనం, మూడు రోజుల తర్వాత విషయం బయటకు పొక్కడంతో సంఘటన స్థలానికి చేరుకొని పాతిపెట్టిన వెండి గోపి శవాన్ని బయటికి తీసిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.








Comments