top of page

టిడిపి ప్రభుత్వ ఏర్పాటు తద్యం.పంతగాని

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Sep 26, 2023
  • 1 min read

టిడిపి ప్రభుత్వ ఏర్పాటు తద్యం.

--మిట్టపల్లి వినాయక చవితి వేడుకల్లో పంతగాని.

ree

వైసిపి అరాచక పాలనకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారని, టిడిపి ప్రభుత్వ ఏర్పాటు తద్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని ప్రసాద్ పేర్కొన్నారు.

మంగళవారం మిట్టపల్లి గ్రామస్తుల ఆహ్వానం మేరకు వినాయక చవితి వేడుకల్లో పంతగాని పాల్గొన్నారు. గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. పంతగాని మాట్లాడుతూ...పాలక పక్షం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేయని తప్పును అనుభవిస్తున్న తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు త్వరగా బయటకు రావాలని ప్రత్యేక పూజలు చేశారు. కలిసికట్టుగా పనిచేసే వైసిపి కుయుక్తులకు ముగింపు ఇవ్వాలని మండల టిడిపి నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ree

ఈ కార్యక్రమం లో మండల తెలుగు దేశం నాయకులు బాలు రామాంజులు, లారీ సుబ్బారాయుడు, మాజీ ఎంపీపీ సౌజన్య, స్థానిక సర్పంచ్ యామల శ్రీదేవి, కాకి శ్రీను, ఈరబత్తిన యానాదయ్య, బిసి నాయకులు మురళి, ధనంజయ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page