కామనూరులో పల్లె పండుగ
- PRASANNA ANDHRA

- Oct 15, 2024
- 1 min read
Updated: Oct 17, 2024
కామనూరులో పల్లె పండుగ

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండలం కామనూరు పంచాయతీ నందు రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద దాదాపు 16 లక్షల రూపాయల వ్యయంతో, కామనూరు గ్రామం నందు గల వేణుగోపాలస్వామి ఆలయం నుండి ఎస్సీ కాలనీ వరకు మరియు ఇతర ప్రదేశాలలో సీసీ రోడ్డు నిర్మించుటకు ఆరు లక్షల రూపాయలు, అలాగే ఎంపీ యూపీఎస్ స్కూల్ ప్రహరీ గోడ నిర్మించుటకు 10 లక్షల రూపాయలు వ్యయంతో అంచనాలు వేసి మాజీ మండలాధ్యక్షులు నంద్యాల రాఘవరెడ్డి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ శమీన్, ఉప సర్పంచ్ ముకుంద రెడ్డి, మాజీ సర్పంచ్ శివ నాగిరెడ్డి, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.








Comments