top of page

జాతర ఉత్సవం లో పాటూరి, ఎల్.వి కి ఘన స్వాగతం.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jun 9, 2022
  • 1 min read

గంగమ్మ జాతరలో

పాటూరి శ్రీనివాసులు రెడ్డి, ఎల్.వి మోహన్ రెడ్డి కి ఘన స్వాగతం.


--నాయకులకు, ఎస్ ఐ కి పలువురి సత్కరిం పు.

--భక్తిశ్రద్ధలతో గంగమ్మను దర్శించుకున్న వేలాది మంది భక్తులు.


ree

అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం తిమ్మాయపాలెం గ్రామం నందు ఈరోజు గంగమ్మ జాతర మహోత్సవం గ్రామ పెద్దలు యువత అందరూ కలిసి సమైక్యం తో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఘనంగా నిర్వహించారు.


ree

సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారు వేకువజామునే గుడిలో కొలువై వేలాది మంది భక్తులకు దర్శనమిచ్చారు. భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకొని పిల్లా పాపలతో కలిసి భక్తి శ్రద్ధలు నడుమ మండల వ్యాప్తంగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.


ree

ree

పాటూరి,ఎల్. వి కి ఘనస్వాగతం: జాతర మహోత్సవం సందర్భంగా విచ్చేసిన వైసిపి సీనియర్ నాయకులు పాటూరి శ్రీనివాసులు రెడ్డి, ఎల్ వి మోహన్ రెడ్డి లకు సదరు గ్రామ సర్పంచ్ తుపాకుల బాలసుబ్రమణ్యం, వైసీపీ నాయకులు సింగర హరి ప్రసాద్, నాగిరెడ్డి గుండాల్ రెడ్డి, ఉప సర్పంచ్ జాకీర్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు, ముస్లిం మత పెద్దలు పాటూరి ఎల్వీ తో పాటు చక్రపాణి రెడ్డిని, స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు ను గజమాలతో సత్కరించి ఘనంగా ఆహ్వానించారు.


ree

ఈ కార్యక్రమంలో మండల ఉప ఎంపిపి సుబ్రమణ్యం రెడ్డి, వైసిపి నాయకులు నాగిరెడ్డి.కరుణాకర్ రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, సుబ్బరాయుడు, సలీం,ఖాదర్, మాగు తదితరులు పాల్గొన్నారు.









Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page