top of page

OTS ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jul 27, 2022
  • 1 min read

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు

OTS ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సర్పంచ్ కొని రెడ్డి శివచంద్రారెడ్డి ,అనంతరం ఆయన మాట్లాడుతూ అమృత నగర్ లో ప్రజలకు OTS ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు దాదాపు పేస్ 4, పేస్ 5 సచివాలయంలో దాదాపు 135 మందికి ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే వన్ టైం సెటిల్మెంట్ చేయడం అన్నది ఎంతో ఉపయోగకరమైనటువంటిది, ఎందుకంటే కొన్ని ఏవన్నా ఇబ్బందులు ఉంటే తద్వారా ప్రజలు బ్యాంకు రుణం తీసుకునే అవకాశం ఉంటుందని వాళ్లకెంతో ఉపయోగపడుతుంది,ఈ పథకం ద్వారా పేదలు చాలా ఎంతో ఉపయోగపడతారని మంచి ఆలోచన చేసిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు, రాబోవు రోజుల్లో ప్రజలు ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు సద్విగం చేసుకోవాలని ఆయన కోరారు అనంతరం సచివాల ఉద్యోగశలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి పలు సూచనలను తెలియజేశారు.

ree

అమృత నగర్ నాలుగు ఐదు సచివాలయాల్లో సెక్రటరీలు, వాలంటీర్లతో జరిపిన సమావేశంలో వాలంటీర్ల పనితీరుపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారితో సమావేశం జరిపి ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధాంగా పనిచేస్తున్న బాధ్యత మీదేనని అలాంటి అద్భుత అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, సర్పంచుల కన్నా అధికారం వాలంటీర్లకి ఉందని వాళ్లకి తెలియజేశారు, రాబోవు రోజుల్లో వాలంటీర్లకు మంచి భవిష్యత్ ఉంటుందని వారికి వేతనాలు పెంచే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కొత్తపల్లి పంచాయతీ సెక్రెటరీ నరసింహ, ఎంపీటీసీ సౌభాగ్యమ్మ, వార్డ్ మెంబర్ తిరుపాల్రెడ్డి, మోచ తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page