ప్రసన్న ఆంధ్ర వార పత్రిక ఆన్లైన్ ఎడిషన్ ప్రారంభం
- MD & CEO

- Jan 5, 2022
- 1 min read
కడప జిల్లా ప్రొద్దుటూరు లో నేడు ప్రసన్న ఆంధ్ర వార పత్రిక ఆన్లైన్ ఎడిషన్ ను ప్రారంభించిన ప్రసన్న ఆంధ్ర వార పత్రిక MD & CEO శ్రీమతి బొలిశెట్టి రెడ్డి ప్రసన్న గారు, ఈ సందర్భంగా ప్రసన్న గారు మాట్లాడుతూ నేటి సమాజంలో పత్రికా రంగానికి ప్రాధాన్యత తగ్గుతున్న నేపథ్యంలో అటు వార పత్రిక ద్వారా అలాగే ఆన్లైన్ ద్వారా వార్తని ప్రజలకు అందించటం కోసం నేడు ఆన్లైన్ ఎడిషన్ ను ప్రారంభించామని, నిజాన్ని నిర్భయంగా రాయగలిగిన విలేఖరులకు తమ సంస్థలో స్థానం కల్పించామని వారు ప్రజల సమస్యలను స్థానిక అధికారులకు నాయకులకు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లటంలో ముందుంటారని ఈ సందర్భంగా ఆమె తెలియచేసారు. పత్రికలో పని చేస్తున్న సిబ్బందికి విలేఖరులకు శుభాకాంక్షలు తెలియచేసారు. ఇకపై ప్రసన్న ఆంధ్ర వార పత్రిక వార్తలు ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటాయని WWW.PRASANNAANDHRA.NET ద్వారా వీక్షకులు వార్తలు చదవగలరని ఆమె కోరారు.









Comments