top of page

ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 29, 2022
  • 1 min read

Updated: Jul 30, 2022

చిట్వేలి నుండి రైల్వేకోడూరు వెళ్లే రహదారిలో ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి.

ree

అన్నమయ్య జిల్లా చిట్వేలి మండల పరిధిలోని చిట్వేలి నుండి రైల్వేకోడూరు వెళ్లే రహదారిలో నగిరిపాడు పంచాయతీ ఎన్ఉప్పరపల్లి వద్ద; చిట్వేలి నుండి సిమెంట్ ఇటుకలు నిండుగా తీసుకెళుతున్న ట్రాక్టర్ రోడ్డు మీద ఉన్న గుంతలను తప్పించిపోయి అదుపుతప్పడంతో బోల్తా పడింది.

ree

ఈ సంఘటనలో మహారాజపురం పంచాయతీ సిద్ధారెడ్డిపల్లి మల్లాలమ్మ ఎస్టి కాలనీకి చెందిన గిరిజన పుత్రులు ఉన్నారు.కాగా ఇందులో డ్రైవరు నాగభూషణంకు(38) కాలు విరిగగా,పక్కన ఉన్న వ్యక్తి నీలం చెంగయ్య(26 ) మరణించగా, మిగిలిన వారికి కొద్దిపాటి గాయాలయ్యాయి.ఎన్ ఉప్పరపల్లి గ్రామ ప్రజలు స్పందించి 108 అంబులెన్స్ సమాచారం ఇవ్వడంతో క్షత్రగాత్రులను చిట్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా ఘటనా స్థలానికి చేరుకున్న చిట్వేలి స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు ప్రమాదానికి గల కారణములు తెలుసుకొని కేసు నమోదు చేసి; పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి తదుపరి దర్యాప్తు చేస్తామని వివరణ ఇచ్చారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page