
24గంటల్లో 18.16లక్షలకు పైగా కరోనా కేసులు
- PRASANNA ANDHRA

- Dec 31, 2021
- 1 min read
దిల్లీ: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. 24గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 18.16లక్షలకుపైగా కొత్త కేసులు బయటపడ్డాయి. ఒక్క అమెరికాలోనే 24గంటల్లో 5.37లక్షల కరోనా కేసులు, 1300కుపైగా మరణాలు నమోదయ్యాయి. ఇక భారత్‌లోనూ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా 16,764 కేసులు, 220 మరణాలు వెలుగుచూశాయి. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 91,361గా ఉంది. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ఒమిక్రాన్ కేసులు 1,270కి చేరాయి.








Comments