శివ భోళానాధుని సత్సంగం మహా మిలన మేల
- PRASANNA ANDHRA

- Jan 27, 2024
- 1 min read
శివ భోళానాధుని సత్సంగం మహా మిలన మేల

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఓంకారమే విశ్వ పరివర్తనకు ఏకైక బీజాక్షర మహా మంత్రమని, ఓం మండలి శివశక్తి అవతార్ సేవా సంస్థ ప్రొద్దుటూరు ఆర్గనైజర్ అండ్ కోఆర్డినేటర్ అవ్వారు సుబ్బరామయ్య ఆధ్వర్యంలో, ఆదివారం ఉదయం పది గంటల నుండి ఒంటిగంట వరకు తోకటవీర క్షత్రియ కళ్యాణ మండపం నందు మహా మిలన మేళ శివ భోళానాధుని సత్సంగం ఏర్పాటు చేయడం జరిగినదని, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంస్థ వ్యవస్థాపకురాలు వందనీయ దేవకీ మాతాజీ సమక్షంలో సర్వేశ్వరుడి దివ్య అవతరణ, సందేశము, ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సామూహిక ఓంకార ధ్యానము, భక్తి జ్ఞాన ప్రసంగాలు, వందేమాతర గేయాలాపన కలదని తెలిపారు. సాయంత్రం మూడు గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుందని సంస్థ ప్రచారకులు ఎం తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. కావున కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా వారు కోరారు.











Comments