ఓబులవారిపల్లె మండలాన్ని బాలాజీ జిల్లాలో కలపాలి
- PRASANNA ANDHRA

- Jan 29, 2022
- 1 min read
కడప జిల్లా, ఓబులవారిపల్లె మండలం రాయచోటి జిల్లాలో కాకుండా ప్రస్తుతం ఉన్న కడప జిల్లాలోనే ఉంచాలని వీలుకాని పక్షంలో శ్రీ బాలాజీ జిల్లాలో కలపాలని ఓబులవారిపల్లె మండలం ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందని ఓబులవారిపల్లె మండలం అభివృద్ధి అధికారి విజయ రావు తెలిపారు. శనివారం రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలోని ఓబులవారిపల్లె మండలం మండల సభాభవనంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు చీర్ల నాగమ్మ అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని మండలాలను కడప జిల్లాలో కాకుండా కొత్తగా ఏర్పాటుచేసిన రాయచోటి జిల్లాలో కలపడంతో సమావేశం ఏకగ్రీవంగా నిరసన తెలియజేసింది. ఓబులవారిపల్లె మండలంలోని జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు, సర్పంచులు అందరూ ఏకగ్రీవంగా రాయచోటి జిల్లాలో కోడూరు నియోజకవర్గాన్ని చేర్చడం ఏకగ్రీవంగా వ్యతిరేకించారు.









Comments