top of page

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ సభ, ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు

  • Writer: EDITOR
    EDITOR
  • May 20, 2023
  • 1 min read

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ సభ...

ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు

ree
ree

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డును ఆనుకొని ఉన్న కైతలాపూర్‌ మైదానంలో శనివారం సాయంత్రం 5గంటలకు ఈ సభ జరగనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా మాజీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత బీజేపీ, వామపక్ష పార్టీల ముఖ్య నేతలు కూడా ఈ సందర్భంగా ఒకే వేదికపైకి వస్తున్నారు. వీరిలో సీపీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శులు సీతారాం ఏచూరి, డీ రాజా, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి ఉన్నారు. అలాగే ఎన్టీఆర్‌ శత జయంతి సభకు అగ్రశ్రేణి సినీ హీరోలు హాజరవుతున్నారు. వీరిలో పవన్‌ కల్యాణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ అల్లు అర్జున్‌, ప్రభాస్‌ తదితరులు ఉన్నారు. కన్నడ సినీ హీరో శివ రాజకుమార్‌, తెలుగు సినీ ప్రముఖులు వెంకటేశ్‌, కల్యాణ్‌రాం, జయప్రద, మురళీ మోహన్‌, రాఘవేంద్రరావు, జీ ఆదిశేషగిరిరావు, అశ్వనీదత్‌, సుమన్‌ తదితరులు హాజరుకానున్నారు.

ree

నందమూరి తారక రామారావు జీవిత విశేషాలతో ‘శకపురుషుడు’ పేరుతో ప్రచురించిన ప్రత్యేక సంచికను ఈ సభలో ఆవిష్కరిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, సమగ్ర విశేషాలతో రూపొందించిన ‘జై ఎన్టీఆర్‌’ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఉపన్యాసాలను ఇందులో జోడిస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి కమిటీ ఆధ్వర్యంలో తొలి సభను శత జయంతి కమిటీ విజయవాడలో నిర్వహించారు. రెండో సభను హైదరాబాద్‌లో పెట్టారు. ఎన్టీఆర్‌ అభిమానులు పెద్దసంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని నిర్వాహణ కమిటీ విజ్ఞప్తి చేసింది.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page