top of page

ఘనంగా ఎన్టీఆర్ 28వ వర్ధంతి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 18, 2024
  • 1 min read

ఘనంగా నందమూరి తారక రామారావు వర్ధంతి నివాళులు

ree
నివాళులర్పిస్తున్న జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి సతీమణి మౌనిక రెడ్డి
ree
నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే వరద
ree
నివాళులర్పిస్తున్న టిడిపి సీనియర్ నాయకులు సీఎం సురేష్ నాయుడు

కడప జిల్లా, ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో గురువారం టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవిని సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి సతీమణి మౌనిక రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించగా, పోట్టిపాడు రోడ్డు బైపాస్ నందు గల ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆయన అనుచరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అలాగే సీనియర్ టిడిపి నాయకులు సీఎం సురేష్ నాయుడు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నందు ఎన్టీఆర్ చిత్రపటానికి సురేష్ నాయుడు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ree

ఈ సందర్భంగా టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి సతీమణి మౌనిక రెడ్డి మాట్లాడుతూ, తెలుగుజాతికి వన్నె తెచ్చి జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి, నవరస నటనా సార్వభౌమూడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు మార్గదర్శకులని కొనియాడారు. తదుపరి గవిని సర్కిల్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు


కార్యక్రమంలో సీనియర్ పార్టీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page