top of page

నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ... తరలివస్తున్న భక్తులు

  • Writer: EDITOR
    EDITOR
  • Jul 29, 2023
  • 1 min read

నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ.. తరలివస్తున్న భక్తులు

ree

నెల్లూరు


మతసామరస్యానికి ప్రతీకగా నిలచే రొట్టెల పండుగ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.. నెల్లూరులోని స్వర్ణాల చెరువు, బారాషహీద్‌ దర్గా వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు..


నేటి నుంచి ఐదు రోజులపాటు ఈ రొట్టెల పండుగ జరగనుంది. పండుగలో భాగంగా నేడు సందన్ మాలి (సమాధుల శుభ్రం), రేపు గంధ మహోత్సవం, 31వ తేదీన రొట్టెల పండుగ, ఆగస్టు 1వ తేదీన తహలిల్ ఫాతేహా (గంధం పంపిణీ), 2వ తేదీన పండుగ ముగింపు ఉంటాయి. కోరిన కోర్కెలు తీర్చే పండుగగా రొట్టెల పండుగ ప్రసిద్ధి..

కోరికలను కోరుకోవడం.. అవి నెరవేరితే.. మరుసటి ఏడాది రొట్టెలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.. ఇలాగే విద్యా రొట్టె, పెళ్లి రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె, వీసా రొట్టె, అభివృద్ధి రొట్టె.. ఇలా ఎన్నోరకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు. వివిధ కోర్కెలకు సంబంధించి స్వీకరించుకున్న రొట్టెలకు బదులుగా తిరిగి మరుసటి సంవత్సరం ఒకటికి రెండు రొట్టెల చొప్పున ఈ స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు పంచుతారు. మిగిలిన వాటిని ఈ చెరువులో వదిలేయడం భక్తుల నమ్మకంగా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి ఈ పండుగలో పాల్గొంటారు..

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page