నెహ్రూ రోడ్డు ప్రజల అందుబాటులోకి విశాలమైన రోడ్లు - ఎమ్మెల్యే రాచమల్లు
- PRASANNA ANDHRA

- Jun 15, 2023
- 1 min read
నెహ్రూ రోడ్డు ప్రజల అందుబాటులోకి విశాలమైన రోడ్లు - ఎమ్మెల్యే రాచమల్లు
35 లక్షల రూపాయల వ్యయంతో మురుగు కాలువల నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా, గురువారం ఉదయం స్థానిక నెహ్రు రోడ్డులోని నాలుగు రోడ్ల కూడలి వద్ద నుండి గాంధీ రోడ్డు వరకు ఇరువైపుల రోడ్డు విస్తరణ నూతన మురుగునీటి కాలువలను నిర్మాణానికి శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాదాపు 35 లక్షల రూపాయల వ్యయంతో నూతన మురుగు కాలువలు రోడ్డు విస్తరణ పనులు చేపట్టి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, 36వ వార్డు కౌన్సిలర్ అలవలపాటి అరుణా దేవి, వైసిపి సీనియర్ నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, కాకర్ల నాగ శేషారెడ్డి కౌన్సిలర్, వరికూటి ఓబుల్ రెడ్డి, అగ్గారపు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.











Great Job