ఆరోపణలు ఖండించిన గ్రామ పెద్దలు
- PRASANNA ANDHRA

- Aug 13, 2022
- 1 min read
Updated: Aug 14, 2022
ఆక్రమించిన గ్రామ స్థలాన్ని తొలగిస్తామన్న గ్రామస్తులపై ఆరోపణలు చేయడం తగదు - ఆరోపణలను ఖండించిన గ్రామ పెద్దలు

ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మీనాపురం గ్రామంలో దేవాలయానికి సంబంధించిన మూడు సెంట్లు భూమిలో మార్కాపురం వెంకటయ్య చేపట్టిన ఇంటి నిర్మాణాన్ని తొలగిస్తామన్న గ్రామస్తులపై అసత్య ఆరోపణలు చేయడం తగదని గ్రామ పెద్దలు నాగరాజు నాయుడు వడ్ల నసీరుద్దీన్ నాగ ముని నాయుడు మరియు గ్రామస్తులు తీవ్రంగా ఖండించారు.
శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ అదే గ్రామానికి చెందిన మార్కాపురం వెంకటయ్య మూడు సెంట్లు గ్రామ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా తనని చంపుతామని బెదిరిస్తున్నారంటూ తమపై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు 1985-91 మధ్య రామచంద్రారెడ్డి మీనాపురం గ్రామంలో మసీదు దేవాలయం ప్రజా మరుగుదొడ్ల కోసం స్థలం కేటాయించారన్నారు దేవాలయానికి సంబంధించిన మూడు సెంట్లు స్థలంలో ఆక్రమించిన మార్కాపురం వెంకటయ్య తొలగించేందుకు ససేమీరా అనడంతో పెద్దమనుషుల దగ్గర జరిగిన పంచాయతీ లో స్థలానికి తగిన తగిన నగదును ఇస్తామని ఒప్పుకొని చెల్లించలేదన్నారు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు అదే గ్రామానికి చెందిన గంజికుంట సంజీవ రాయుడు అనే అతను కులాన్ని కూడా కబ్జా చేసినట్లు మార్కాపురం వెంకటయ్య పై ఆరోపణలు ఉన్నాయన్నారు తక్షణమే ఆక్రమించిన స్థలాన్ని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించడంతో దిక్కుతోచక తిరిగి గ్రామస్తులపై చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తమకు, గ్రామస్తులకు మార్కాపురం వెంకటయ్య పై అలాంటి ఉద్దేశం లేదన్నారు. ఆక్రమించిన గ్రామ స్థలంలో నిర్మించిన ఇంటిని తొలగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో గ్రామస్తులు చావిటి రమేష్ చిట్టిబోయిన మునయ్య బుర్ర వెంకటసుబ్బయ్య కొమ్మది రమేష్ గిడ్డంగి మహబూబ్ బాషా నరసింహులు చంద్రశేఖర్ మునిస్వామి వెంకటయ్య పెద్ద సుబ్బన్న వడ్ల నజీర్ కొమ్మది జనార్దన్ రెడ్డి గండ్లూరు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు








Comments