చిట్వేలిలో ఘనంగా 78వ ఎన్సిసి దినోత్సవ వేడుకలు
- EDITOR

- Nov 25
- 1 min read
చిట్వేలిలో ఘనంగా 78వ ఎన్సిసి దినోత్సవ వేడుకలు

అన్నమయ్య జిల్లా, చిట్వేలి
30వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి కమాండింగ్ అధికారి కల్నల్ సూర్యనారాయణ మూర్తి ఆదేశాల మేరకు చిట్వేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్సిసి ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎన్సిసి క్యాడేట్లచే 78వ ఎన్సిసి దినోత్సవ వేడుకలును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి దుర్గరాజు మాట్లాడుతూ, ఎన్సిసి శిక్షణతో క్రమశిక్షణ, దేశభక్తి అలవాడతాయన్నారు. ఈ సందర్భంగా ఎన్సిసి అధికారి పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ, ఎన్సిసి దినోత్సవ వేడుకలలో భాగంగా "చెత్త బుట్టలను సరైన రీతిలో ఉపయోగించడం ఎలా" అనే అంశంపై సెమినార్ నిర్వహించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు.

ఈ సెమినార్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎన్సిసి క్యాడెట్లు సాయి సుజిత్, భరత్, కార్తీక్, ముస్కాన్, రుకయ, వైష్ణవి లకు సీనియర్ ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, దాత జానీతో కలిసి బహుమతి ప్రధానం చేయడం జరిగిందన్నారు. తదనంతరం ఎన్సిసి క్యాడట్లతో కలిసి పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, దాత జానీ, ఎన్సిసి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.









Comments