top of page

నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Aug 16, 2022
  • 1 min read

Updated: Aug 17, 2022

నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం


వై.ఎస్.అర్ జిల్లా, ప్రొద్దుటూరు

ree

కుల మతాలకు అతీతుడు అందరి క్షేమం కోరే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయి బ్రాహ్మణ కుల దూషణకు విముక్తి కల్పిస్తూ జీవో విడుదల చేసిన సందర్భంగా ప్రొద్దుటూరు నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కడప జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ముద్దనూరు గురప్ప జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక మైదుకూరు రోడ్డులో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ఆయన సార్ వైయస్సార్ కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నాయి బ్రాహ్మణుల ఇలా దూషణ విముక్తి కలిగిస్తూ జీవో విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతుడు అందరి క్షేమం కోరే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు నాయి బ్రాహ్మణులను కుల దూషణ చేయరాదని అలా చేస్తే హైకోర్టు ఉత్తర్వుల మేరకు శిక్షలు విధిస్తామని తెలపడం అభినందనీయమన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు బలపనూరు శ్రీనివాసులు పట్టణ అధ్యక్షులు కొత్తపల్లి కిషోర్ ఏరియా అధ్యక్షులు రాముడు సుబ్బయ్య గురు స్వామి గురు శేఖర్ పెద్దన్న సంజీవ కర్ణ మస్తాన్ కృష్ణ నరసింహులు రాజుపాలెం మండల నాయకులు జయరామకృష్ణయ్య తదితర నాయి బ్రాహ్మణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page