నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
- PRASANNA ANDHRA

- Jan 6, 2022
- 1 min read
3 వారాల వరకు నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలు జరపొద్దని హైకోర్టు ఆదేశించింది. నరసరావుపేట మున్సిపాలిటీలో విలీనమయ్యే గ్రామాల్లో ఓటర్లు మళ్లీ పురపాలక సంఘంలో ఓటుహక్కు వినియోగించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అలాగే వార్డుల రిజర్వేషన్ హేతుబద్ధంగా జరగలేదని పిటిషనర్ పేర్కొన్నారు. రాజకీయ పక్షాలకు ఓటర్ల జాబితా కూడా ఇవ్వలేదని పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. విజ్ఙప్తులన్నింటిపై వారం రోజుల్లో విజ్ఙాపన పత్రం ఇవ్వాలని పిటిషనర్‌ని హైకోర్టు ఆదేశించింది. ఆ తరువాత రెండు వారాల్లో పిటిషనర్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించాలని ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు ఆదేశించింది. అప్పటివరకు ఎన్నికలు నిర్వహించవద్దని హైకోర్టు తెలిపింది.








Comments