top of page

మత్స్యకార అభ్యున్నతి యాత్ర, నరసాపురం సభ విజయవంతం!

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Feb 20, 2022
  • 1 min read

ree

తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం సెంటర్ నందు ఈరోజు జనసేనాని ప్రభంజనం! మొదలైందని, జనసైనికులు నిరూపించారు. అతి భారీ ఎత్తున దారిపొడవునా జనసేనాని పవన్ కళ్యాణ్ నీరాజనాలు అందుకుంటూ, అమోఘమైన భారీ ర్యాలీతో, ప్రజల నాయకుడుగా, ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఒక యోధుడుగా రావులపాలెం నుంచి ఈతకోట మీదుగా గోపాలపురం నుంచి మార్టేరు మీదుగా నరసాపురంకు కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాస్ నాయకత్వంలో సాగిన ఈ యాత్రకు జనసైనికుల ప్రభంజనముతో, భారీ స్థాయిలో ముందుకు సాగుతూ. రాబోయే రోజుల్లో ఎన్నికలనే సంగ్రామంలో, యుద్ధభూమిలో నిలబడడానికి ఒక వీరుడుగా, ఒక వీర జనసైనికుడుగా, జనసేన సైన్యంతో నరసాపురం మత్స్యకార అభ్యున్నతి సభకు బయలుదేరిన జనసేనానికి, దారి పొడవునా మహిళలు, యువకులు, యువత, ఆడపడుచుల దీవెనలతో, మంగళహారతులతో జయ, జయ ధ్వానాల నడుమ నరసాపురం మత్స్యకార యాత్ర సభకు ఊరేగింపుగా దారిపొడుగునా నీరాజనాలు అందుకుంటూ ముందుకు జనసేనాని కదిలారు., ప్రజల్లో ఒక మార్పు మొదలైందని, నిరూపిస్తూ , ప్రజలను గుండెల్లో పెట్టుకుని, పరిపాలించే నాయకత్వాన్ని అందించగల సమర్ధుడుగా, చిరస్థాయిగా నిలబడగల ఒక గొప్ప నాయకుడని, రాబోయే రోజుల్లో మంచి పరిపాలన అందించాలనే లక్ష్యంతో ప్రజల కోసం నిలబడతారని, ప్రజలకు భరోసానీస్తూ, మత్స్యకార యువతకు, మత్స్యకార ప్రజలను కష్టాలు నుంచి కాపాడడానికి, అండగా నిలబడిన దమ్మున్న నాయకుడు అని నిరూపించారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నాననే, ఒక బోరోసా, ఒక గుండె కె ధైర్యాన్నినీచ్చారని, బండారు శ్రీనివాస్, జనసేనానిని కొనియాడారు. వీరి వెంట పలువురు జన సైనికులు, కార్యకర్తలు, నాయకులు నరసాపురం యాత్రకు బయలుదేరి వెళ్ళినారనీ, మత్స్యకార అభ్యున్నతి యాత్ర సభ చాలా విజయవంతంగా కొనసాగిందని, నా వెన్నంటి ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు, వీర మహిళలకు, ప్రజలకు, మహిళలకు, జన సైనికులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలను తెలియజేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page