1500 కి.మీ. మైలురాయికి చేరుకున్న నారా లోకేష్ యువగళం
- PRASANNA ANDHRA

- Jun 6, 2023
- 1 min read
1500 కి.మీ. మైలురాయికి చేరుకున్న నారా లోకేష్ యువగళం


జనగళమే యువగళమై అయిదు కోట్ల మంది రాష్ట్రప్రజల ఆశీస్సులతో మహోజ్వలంగా సాగుతున్న యువగళం పాదయాత్ర, ఈరోజు కడపలో 1500 కి.మీ. మజిలీకి చేరుకోవడం సంతోషంగా ఉందని పోస్ట్ పెట్టారు నారా లోకేష్. ఈ సందర్భంగా కడప నగరంలో మెరుగైన డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటుకు అలంఖాన్ పల్లె వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించానని తెలిపారు. అధికారంలోకి వచ్చాక కడప నగర ప్రజలకు మురుగునీటి బెడద నుంచి విముక్తి కలిగించే ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తానని యువగళం సాక్షిగా మాట ఇస్తున్నానని పేర్కొన్నారు లోకేష్.










Comments