top of page

లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన విచారణ

  • Writer: EDITOR
    EDITOR
  • Sep 29, 2023
  • 1 min read

లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన విచారణ

ree

అమరావతి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ వ్యవహారంపై గతేడాది నమోదుచేసిన కేసులో ఏ14గా ఆయన పేరును సీఐడీ ఇటీవల చేర్చింది..


ఈ నేపథ్యంలో హైకోర్టులో లోకేశ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.


రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో లోకేశ్‌కు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇస్తామని.. దానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తామని కోర్టుకు తెలిపారు. సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు అంటే అరెస్ట్‌ ప్రస్తావన రానందున.. ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు..


మరో రెండు కేసుల్లో లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్లు


నారా లోకేశ్‌ మరో రెండు కేసుల్లో హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఫైబర్‌ గ్రిడ్‌ కేసుల్లో పిటిషన్లు వేసిన ఆయన.. అత్యవసరంగా విచారించాలని కోరారు. ఈ పిటిషన్లు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశముంది.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page